నిజామాబాద్ నగరం చంద్రశేఖర్ కాలనీలోని అర్బన్ హెల్త్ సెంటర్లో గర్భిణులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు మేయర్ దండు నీతూ కిరణ్ మాస్కులు అందించారు. కరోనా వ్యాధి రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
అత్యవసర పనులుంటే తప్ప బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలందరూ భౌతికదూరం పాటిస్తూ... వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని సూచించారు. కార్యక్రమంలో నగర కమిషనర్ జితేష్, డీఎంహెచ్ఓ డాక్టర్ సుదర్శనం పాల్గొన్నారు.