భాజాపా జాతీయ పార్టీ కనుక మేనిఫెస్టోలో ప్రతి అంశాన్ని పొందుపర్చలేదని ఆపార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ అన్నారు. ఇందూరులోని మార్కెట్ యార్డులో పసుపు రాశులను పరిశీలించారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు అమలులో తెరాస సర్కారు విఫలమైందన్నారు. భాజపాకు మద్దతివ్వాలని కార్మికులను అభ్యర్థించారు. తాను పసుపు బోర్డును తేలేకపోతే రాజీనామా చేసి రైతుల తరఫున ఉద్యమం చేస్తానన్నారు.
ఇదీ చదవండి: 'అవినీతి రహిత పాలన మోదీతోనే సాధ్యం'