ETV Bharat / state

'నిజామాబాద్ అన్నదాతలం' సహకరించండి: కలెక్టర్​

అభాగ్యులు, అనాధలను ఆదుకునేందుకే "నిజామాబాద్ అన్నదాతలం" కార్యక్రమమని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు.

Nizamabad Annadatalam Collaborative collector narayana reddy
'నిజామాబాద్ అన్నదాతలం' సహకరించండి: కలెక్టర్​
author img

By

Published : Apr 25, 2020, 7:33 PM IST

నిజామాబాద్ ఫుడ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్​తో కలిసి కలెక్టర్ నారాయణరెడ్డి పాల్గొన్నారు. లాక్​డౌన్​లో చిక్కుకున్న వారికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పేదలకు భోజనం అందించాలనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని కలెక్టర్ అన్నారు. స్వచ్ఛంద సంస్థలతోపాటు దాతలు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి విరాళాలు అందించాలని కోరారు. సాయం చేసే దాతలు సంబంధిత మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవోకు సమాచారం అందించాలన్నారు.

నగదు రూపంలో అందించేవారు నిజామాబాద్ ప్రగతి భవన్ ఎస్​బీఐ శాఖ ఖాతా నెంబర్ 39245935233, ఐఎఫ్​ఎస్​సీ కోడ్​ SBIN0020961కు వెయ్యి రూపాయల నుంచి ఎంతైనా జమ చేసి అభాగ్యులు, అనాధలకు, అన్నార్తులకు చేయూతను అందించాలన్నారు. ఈ పుణ్య, బృహత్తర కార్యక్రమంలో మీరు భాగస్వాములు కావాలని ఆయన దాతలను కోరారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ బ్యాంక్ వ్యవస్థాపక అధ్యక్షులు నవీన్ చంటి, వాలెంటీర్లు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : ఆర్టీసీపై తీవ్రంగా పడిన కరోనా ప్రభావం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.