నిజామాబాద్ నగర కార్పొరేషన్ మేయర్‌గా దండు నీతూ కిరణ్ బాధ్యతలు స్వీకరించారు. కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ ఛాంబర్‌లో సర్వమత ప్రార్థనల నడుమ పదవి బాధ్యతలు చేపట్టారు.
ఈ కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ ఆకుల లలిత హాజరయ్యారు. తనకు ఇంత పెద్ద బాధ్యతలు అప్పగించిన కేసీఆర్, కేటీఆర్‌లకు రుణపడి ఉంటానని నీతూ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: పండ్లు అమ్ముకునే వ్యక్తికి పద్మశ్రీ.. ఎందుకంటే?