ETV Bharat / state

'యువకుడి హత్య విషయంలో బాధ్యులను కఠినంగా శిక్షించాలి'

బోధన్​లో జరిగిన ఓ యువకుడి హత్య విషయంలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని మృతుడి కుటుంబీకులు డిమాండ్​ చేశారు. బాధ్యులను శిక్షించాలని కోరుతూ కలెక్టర్​ నారాయణరెడ్డితో పాటు సీపీ కార్తికేయలను కలిసి వినతి పత్రం అందజేశారు.

murder case at bodhan in nizamabad
'యువకుడి హత్య విషయంలో బాధ్యులను కఠినంగా శిక్షించాలి'
author img

By

Published : Sep 17, 2020, 8:18 PM IST

నిజామాబాద్​ జిల్లా బోధన్​లో జరిగిన సందీప్ అనే యువకుడి హత్య విషయంలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని మృతుని కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు నందిపేట మండలం కంఠం గ్రామానికి చెందిన సుమారు 100 మంది నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చి బాధ్యులను కఠినంగా శిక్షించాలని నిరసన తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ నారాయణ రెడ్డితో పాటు సీపీ కార్తికేయలను కలిసి వినతి పత్రం అందజేశారు.

నవీపేట్ మండలంలోని కంఠం గ్రామానికి చెందిన యువకుడిని అదే గ్రామానికి చెందిన యువతి కుటుంబీకులు, ప్రేమ వ్యవహారంలో బోధన్​కు పిలిపించి 12 మంది కలిసి హత్య చేశారని మృతుడి తల్లి నర్సుభాయి పేర్కొన్నారు. అయితే హత్య చేసిన వారిలో ఒకరిపై మాత్రమే కేసు నమోదు చేశారని, నలుగురిని బెయిల్​పై వదిలేశారని, మరో 7గురిని వదిలేశారని తెలిపారు. కావున అధికారులు హత్యకు పాల్పడిన 12 మందిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి: బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.