ETV Bharat / state

కల్యాణ లక్ష్మీ సొమ్ము కోసం భార్యను తగలబెట్టాడు - murder-attempt-on-pregnent-lady

కల్యాణ లక్ష్మీ... ఆడపిల్ల తల్లిదండ్రులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న కానుక. కానీ.. ఆ ఆసరానే ఈ ఆరునెలల గర్భిణీ ఉసురు తీసింది. ఒకప్పుడు కట్నం కోసం పెళ్లిచేసుకుని వేధించే అత్తింటివారు ఇప్పుడు కల్యాణ లక్ష్మీ చెక్కు కోసం ప్రాణం తీయబోయారు.

కల్యాణ లక్ష్మీ సొమ్ము కోసం భార్యను తగలబెట్టాడు
author img

By

Published : May 24, 2019, 4:52 PM IST

నిజామాబాద్​ జిల్లా బోధన్​ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. బోధన్​ మండల పరిధిలోని రాకసిపేటకు చెందిన ప్రశాంత్​ సీతాలును వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లపాటు బాగానే చూసుకున్నాడు భర్త. ఎప్పుడైతే కల్యాణ లక్ష్మీ చెక్కు వచ్చిందో అప్పుడే అతని అసలు రంగు బయటపడింది. కేవలం డబ్బు కోసమే వివాహమాడానని, ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని రోజు సీతాలును వేధించేవాడు. వేధింపులు తట్టుకోలేక ఆరు నెలల గర్భిణిగా ఉన్న సీతాలు తన పుట్టింటికి వెళ్లిపోయింది.

నిప్పు పెట్టి ఆస్పత్రిలో చేర్పించాడు

బాగా చూసుకుంటానని నమ్మించి మళ్లీ తీసుకొచ్చాడు ప్రశాంత్. తల్లి, తమ్ముడితో కలిసి కిరోసిన్​ పోసి నిప్పంటించి ఆమెను హతమార్చాలనుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన సీతాలును ఆస్పత్రిలో చేర్పించి అంతా పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీతాలు స్టేట్​మెంట్​ రికార్డు చేసుకున్నారు.

ఇదీ చూడండి : 'చంద్ర గ్రహణం లేదు... చంద్రుని ఛాయ లేదు'

TG_NZB_01_24_MURDER_ATTEMPT_ON_PREGNENT_LADY_AV_C8 () *నిజామాబాద్ బ్రేకింగ్* నిజామాబాద్ జిల్లా బోధన్ లో దారుణం. ఆరు నెలల గర్భవతిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన అత్త,భర్త,మరిది. బోధన్ రాకసిపేట లో 6 నెలల గర్భవతి సీతలు పై అత్తింటి వారు కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త. ఇంటికి తీసుకెళతామని సీతాలు ఇంటికి వెళ్లిన భర్త ప్రశాంత్ ,అత్త లక్ష్మీ ,మరిది మహేష్ . డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సీతాలు కళ్యాణ లక్ష్మీ చెక్కు కోసం పెళ్ళైన నెల వరకు భార్యతో బాగున్న భర్త గైని ప్రశాంత్ . చెక్కు వచ్చాక ఇష్టం లేని పెళ్లి చేశారని సీతాలు పై వేధింపులు. కిరోసిన్ పోసి నిప్పంటించి ఆసుపత్రి లో చేర్పించిన భర్త, అత్త. ఆ పై పరారీలో అత్త,భర్త,మర్ధి బోధన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు... స్టేట్ మెంట్ రికార్డ్ చేసుకున్న బోధన్ పోలీసులు సీతాలు పరిస్థితి విషమం.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.