రైతుల వరి పంటలు ఎండిపోతుంటే తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. రైతులకు తక్షణమే నష్ట పరిహారం అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇళ్లు కట్టుకునేందుకు రెండు లక్షల రూపాయలు కేంద్రం ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బాబాపూర్లో ఎండిన వరి పంటలను ఆయన పరిశీలించారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో దీక్షలు చేస్తున్నది దళారులు, ద్రోహులేనని ఆయన మండిపడ్డారు. దేశ ద్రోహులే రైతులకు మేలు చేసే చట్టాలను వ్యతిరేకిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని పలువురు యువకులను కండువా కప్పి భాజపాలోకి ఆహ్వానించారు.