ETV Bharat / state

అర్వింద్‌.. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే చెప్పుతో కొడతా: కవిత

MLC kavitha fires on aravind: భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై తెరాస ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘అర్వింద్‌.. ఇంకోసారి నా గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే నిజామాబాద్‌ చౌరస్తాలో చెప్పుతో కొడతా. నువ్వు ఎక్కడ పోటీ చేసినా వెంటబడి ఓడిస్తా. రాజకీయాలు చేయండి.. దిగజారి ప్రవర్తించొద్దు’’ అని కవిత హితువు పలికారు.

kavitha
kavitha
author img

By

Published : Nov 18, 2022, 12:36 PM IST

Updated : Nov 18, 2022, 2:10 PM IST

MLC kavitha fires on aravind: తాను కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్తున్నానని భాజపా నేత, ఎంపీ ధర్మపురి అర్వింద్‌ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. మరోసారి తప్పుడు విమర్శలు చేస్తే... ఊరుకునేది లేదని ఘాటుగా హెచ్చరించారు. తన బతుకే తెలంగాణ అని... కాంగ్రెస్‌ మద్దతుతో ఎంపీగా గెలిచిన వ్యక్తి అర్వింద్‌ అని విమర్శించారు.

భవిష్యత్తులో ఎక్కడ పోటీ చేసినా... వెంటాడి ఒడిస్తానని హెచ్చరించిన కవిత... తప్పుడు విమర్శలు చేస్తే గట్టిగా బుద్ధిచెబుతామన్నారు. ఏకనాథ్‌ షిందే మాదిరిగా... తననూ భాజపాలోకి రావాలని కొందరు ప్రతిపాదనలు తెచ్చినట్లు కవిత స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదనలను తాను తిరస్కరించినట్లు చెప్పిన కవిత... అలాంటి రాజకీయాలను తెలంగాణ ప్రజలు సహించబోరన్నారు.

'నా గురించి మరోసారి తప్పుగా మాట్లాడితే తీవ్రంగా ప్రతిఘటిస్తాం. నాపై అభాండాలు వేయాలని ఎంపీ అర్వింద్‌ చూస్తున్నారు. పిచ్చిగా మాట్లాడితే నిజామాబాద్‌ చౌరస్తాలో చెప్పుతో కొడతా. అర్వింద్‌ను ఎన్నికల్లో వెంటబడి ఓడిస్తాం. అరవింద్‌ ఎక్కడ పోటీచేసినా ఓడిస్తాం. రాజకీయాలు చేయండి.. దిగజారి ప్రవర్తించవద్దు. నేను పార్టీ మారతానని ప్రచారం చేస్తే గట్టిగా బుద్ధి చెబుతాం. నేను కాల్‌ చేశాననే ఆరోపణపై ఖర్గేను అడగండి. భాజపా వాళ్లపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు ఉండవు. భాజపాలో చేరాలని నన్ను కోరారు. భాజపాలోని స్నేహితులు కొన్ని ప్రతిపాదనలు నా ముందుంచారు.'-కవిత, ఎమ్మెల్సీ

పిచ్చిగా మాట్లాడితే నిజామాబాద్‌ చౌరస్తాలో బుద్ధి చెబుతాం: కవిత

ఇవీ చదవండి:

Last Updated : Nov 18, 2022, 2:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.