ఎమ్మెల్సీ కవిత మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఓ వీడియో జర్నలిస్టు వైద్యం కోసం ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఓ మీడియా సంస్థలో కెమెరామెన్‌గా పనిచేస్తున్న కల్యాణ్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కవిత అర్థిక సాయం చేశారు. ఆమె ఆదేశాలతో బాధితుడి కుటుంబసభ్యులకు తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతి రావు రూ.50వేల నగదు అందజేశారు.
ఈ ఆర్థిక సాయంతో పాటు సీఎంఆర్‌ఎఫ్ నుంచి సాయం అందజేస్తామని ఆయన తెలిపారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. కల్యాణ్ కుటుంబానికి కవిత అండగా ఉంటారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జగృతి నాయకులు నవీన్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మా మౌనాన్ని బలహీనతగా భావించొద్దు: కేటీఆర్