నిజామాబాద్ జిల్లా ఆర్ముర్‌లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పర్యటించారు. పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా వద్ద నిర్మించిన ట్రాఫిక్ సిగ్నల్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. మున్సిపాలిటీకి కొత్తగా మంజూరైన తడి, పొడి చెత్త వాహనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు అనంతరం 24 వార్డుల్లో రూ. కోటి 19 లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతీ ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు ఎమ్మెల్యే. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
![mla jeevanreddy started development programs in armur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nzb-01-07-mla-trafick-open-avb-ts10067_07072020123856_0707f_00831_467.jpg)