ETV Bharat / state

'అన్ని ఊర్లు తిరుగుతున్నవ్​... నీ ఆరోగ్యం జాగ్రత్త బిడ్డా' - మాతృదినోత్సవం

మాతృదినోత్సవం సందర్భంగా తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి. తన మాతృమూర్తి యోగక్షేమాలు మంత్రి అడిగి తెలుసుకోగా... ఆమె ప్రశాంత్​రెడ్డిని ఆలింగనం చేసుకుని పలు జాగ్రత్తలు చెప్పారు.

minister-prashanth-reddy-celebrates mothers day with his mother in nizamabad district
'అన్ని ఊర్లు తిరుగుతున్నవ్​... నీ ఆరోగ్యం జాగ్రత్త బిడ్డా'
author img

By

Published : May 10, 2020, 10:18 PM IST

నిజామాబాద్​ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలోని స్వగృహంలో మాతృ దినోత్సవం సందర్భంగా తన తల్లి వేముల మంజుల సురేందర్ రెడ్డి ఆశీర్వాదం తీసుకున్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. మాతృమూర్తి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 'నా ఆరోగ్యం బాగానే ఉంది... కరోనా రోగం వచ్చిందని టిీవీలో చూస్తున్నా..నీవు అన్ని ఊర్లు తిరుగుతున్నావ్ నీ ఆరోగ్యం జాగ్రత్త బిడ్డా' అని మంత్రి తల్లి ఆయన్ని ఆత్మీయ ఆలింగనం చేసుకుని పలు జాగ్రత్తలు చెప్పారు. మంచిగానే ఉన్నా అమ్మ నీ ఆశీర్వాదం ఉండగా మాకు ఏం కాదు అని తల్లి చేతులను ఆప్యాయంగా పట్టుకుని తల్లికి మంత్రి ధైర్యం చెప్పారు.తన సోదరునితో కలిసి ఆమెకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఆమె నిండు మనసుతో తన ఇద్దరు కుమారులను ఆశీర్వదించారు. చెమ్మగిల్లిన కళ్లతో మంత్రి మాట్లాడుతూ... ప్రపంచంలోనే స్వచ్ఛమైనది తల్లిప్రేమ ఒక్కటే అని, మాతృ దినోత్సవం రోజున ఆమె కుటుంబం కోసం చేసే త్యాగాన్ని గుర్తు చేసుకోవడం వల్ల వెయ్యి ఏనుగుల బలం చేకూరుతుందన్నారు. ఎందరో తల్లుల యోగక్షేమాలు ఆలోచించే ముఖ్యమంత్రి కేసీఆర్ వృద్ధాప్య పింఛను, వితంతు పింఛను, ఒంటరి మహిళలకు, బీడీలు చుట్టే తల్లులకు పింఛను అందిస్తున్నారన్నారు. కుటుంబంలోని ప్రతి తల్లి తన బిడ్డలను ఆశీర్వదించినట్లుగానే ముఖ్యమంత్రి కేసీఆర్​కు తల్లులందరి ఆశీర్వాదం ఉందన్నారు. ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు తల్లులను గౌరవించుకోవాలని, అది మన సంప్రదాయంలో భాగమన్నారు.

ఇవీ చూడండి: కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి కేటీఆర్ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.