ETV Bharat / city

చేనేత రంగాన్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకోండి: కేటీఆర్​ - telangana taza news

ktr letter to central textile minister
కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రికి కేటీఆర్ లేఖ
author img

By

Published : May 10, 2020, 8:03 PM IST

Updated : May 11, 2020, 12:04 AM IST

19:51 May 10

చేనేత రంగాన్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకోండి: కేటీఆర్​

           ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే హ్యాండ్లూమ్, చేనేత, అప్పారెల్ పరిశ్రమలపైన ప్రధానంగా దృష్టి సారించాలని మంత్రి కేటీఆర్​ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. స్థానిక యువతకు, ప్రజలకు ఉపాధి కల్పించే ఈ రంగం పైన అధికంగా దృష్టి సారించడం ద్వారా స్థూల జాతీయోత్పత్తి, ఎగుమతులను పెంచేందుకు అవకాశం ఉందని గుర్తు చేశారు. ఈ రంగం పైన ఆధారపడిన లక్షలాది మంది ఉపాధిని కాపాడేందుకు తక్షణం తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు.  

పరిశ్రమ పుంజుకుంటుంది

ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ సంక్షోభం అన్ని రంగాల్లోపాటు చేనేత, జౌళి పరిశ్రమను కూడా ప్రభావితం చేసిందని కేటీఆర్​ తన లేఖలో పేర్కొన్నారు. భారత దేశం నుంచి ఎగుమతయ్యే వస్త్రాల విలువ సుమారు 36 బిలియన్ డాలర్లుగా ఉందన్నారు. ప్రస్తుత సంక్షోభ కాలంలో పరిశ్రమపైన పెద్ద ఎత్తున ప్రభావం ఉందన్నారు. మన దేశం నుంచి ఎక్కువగా వస్త్రాలను దిగుమతి చేసుకునే అమెరికా, యూరప్ దేశాల్లోని ఆర్థిక వ్యవస్థ పరిస్థితి మెరుగు పడిన తర్వాతే ఇక్కడి వస్త్ర పరిశ్రమ పుంజుకుంటుదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. పరిశ్రమపైన ఉన్న ఒత్తిడిని తగ్గించే చర్యలు తీసుకుంటూనే, మరోవైపు నూతన అవకాశాలను అందుకునే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తే ఈ రంగంలో ఉపాధి అవకాశాలకు భరోసా కల్పించినవారవుతారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందుకు సంబంధించి పలు సలహాలు, సూచనలను మంత్రి తన లేఖలో పేర్కొన్నారు.  

ఆరు నెలల కనీస మద్దతు ధర..

        ప్రస్తుతం పరిశ్రమలో పని చేస్తున్న వారికి 50 శాతం కూలీ మద్దతు కనీసం 6 నెలలపాటు ఇవ్వాలన్నారు.  దీర్ఘకాలంలో పరిశ్రమకు అవసరమైన రుణ వాయిదాలను చెల్లించే అంశంలో దీర్ఘకాలిక రుణాలను కల్పించడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. మూడు నెలలపాటు  పరిశ్రమలో పనిచేస్తున్న వారందరి పీఎఫ్, ఈఎస్ఐ వంటి వాటిని కేంద్రమే భరించే నిర్ణయం తీసుకోవాలని కోరారు. తద్వారా స్వల్పకాలంలోనే పరిశ్రమలో నగదు లభ్యత పెరుగుతుందన్నారు.  

 పరిశ్రమకు బ్యాంకుల ద్వారా మరింత భరోసా కల్పించవచ్చన్న కేటీఆర్.. ప్రస్తుతమున్న రుణాలకు అదనంగా మరిన్ని రుణాలను అందించాలన్నారు. ప్రస్తుత రుణాలపైనా ఉన్న వడ్డీ.. మాఫీ లేదా సంవత్సరం పాటు మారటోరియం విధించాలన్నారు. రుణాలకు సంబంధించిన బకాయిలను చెల్లించడంలో వెనుకబడిన పరిశ్రమ యూనిట్లను.. ఆరునెలల నుంచి సంవత్సరం వరకు నాన్ ఫార్మమింగ్ అసెట్స్​గా (ఏన్పీఏ) ప్రకటించవద్దని కోరారు.  

రైతుల ఖాతాకే నగదు..

        ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రిబేట్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ టాక్సెస్ అండ్ లెవిస్ పథకాన్ని యార్న్, ఫ్యాబ్రిక్​లకు విస్తరించాలన్నారు. వస్త్ర ఎగుమతులపైనా ఏడాదిపాటు అదనపు ప్రోత్సాహకాలను అందించాలని కోరారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్​లో ఉన్న ఉన్న జీఎస్​టీ రిఫండ్​లను వెంటనే చెల్లించాలన్నారు. జీఎస్టీలో మాన్ మేడ్ ఫైబర్ రంగానికి మరింత వెసులుబాటు కల్పించడం ద్వారా నూతన పెట్టుబడులను అందుకోవచ్చని మంత్రి సూచించారు. పత్తి కొనుగోలు మద్దతుకు సంబంధించి... రైతులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకంలో భాగంగా సబ్సిడీలను నేరుగా వారి అకౌంట్లోనే వేయాలని సూచించారు.  

ప్రస్తుతం భారతదేశంలో ఉపాధి అందిస్తున్న సాంప్రదాయ రంగాల్లో చేనేత ఒకటన్నారు. తెలంగాణలోని పోచంపల్లి, గద్వాల్ వంటి ప్రముఖ చేనేత ప్రాంతాలతో పాటు ఇక్కత్, గద్వాల్ కాటన్, నారాయణపేట్ కాటన్, గొల్లభామ వంటి అనేక రకాలైన సుసంపన్న చేనేత కళ తెలంగాణలో ఉన్నదని మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రికి గుర్తు చేశారు. ప్రస్తుతం లాక్​డౌన్ వలన పెద్ద ఎత్తున చేనేత ఉత్పత్తులు పేరుకుపోయాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. వాటి విక్రయాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ -కామర్స్ మాధ్యమాలను అనుసంధానం చేయాలన్నారు.  

బీ ఇండియన్​- బై ఇండియన్​.. 

బీ ఇండియన్ ఇండియన్ , బై ఇండియన్ (భారతీయులుగా ఉండండి, భారతీయ వస్తువులను కొనండి)అనే నినాదంతో పెద్దఎత్తున కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ప్రస్తుతం ఏర్పడిందన్నారు. ఇలాంటి కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రానున్న రెండు సంవత్సరాలపాటు చేనేత వస్త్రాలపైన పూర్తిస్థాయి జీఎస్టీ మినహాయింపులు కూడా పరిశీలించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం చేనేత రంగాన్ని ఆదుకునేందుకు అనేక చర్యలు చేసుకుందన్నారు. తాజాగా ప్రతి ఒక్క చేనేత మగ్గాన్ని గుర్తించి జియో టాగ్ చేసినట్లు తెలిపారు. తద్వారా ప్రభుత్వ ప్రయోజనాలను నేరుగా వారికి అందేలా చూస్తున్నామని తెలిపారు. ఇలాంటి ప్రయత్నమే జాతీయ స్థాయిలో చేపట్టాలని సూచించారు.

       కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన పాలసీ మార్పులతోపాటు పరిశ్రమకు అవసరమైన నూతన పథకాలను ప్రవేశ పెడితే దేశంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్.. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వంతో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

ఇవీచూడండి: ఆపరేషన్​ కరోనా: సీఎంలతో రేపు మోదీ భేటీ

Last Updated : May 11, 2020, 12:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.