పట్టణ ప్రగతి కార్యక్రమానికి ప్రాధాన్యతనిచ్చి పట్టణాలు, నగరాలను సుందరంగా మార్చుకోవాలని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్‌లోని పర్యటించిన మంత్రి... పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. మున్సిపాలిటీలకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో కలిసి పలు వీధుల్లో పర్యటించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
ప్రతీ మున్సిపాలిటీలో విస్తృతంగా మొక్కలను నాటి సంరక్షించేందుకు ప్రత్యేకంగా ట్రాక్టర్, ట్యాంకర్‌ను అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజలు సైతం ఈ కార్యక్రమంలో భాగస్వాములై పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు కృషి చేయాలని సూచించారు.