గాంధీ జయంతి నాటికి స్వచ్ఛ నిర్వహణలో రాష్ట్రం ముందుండాలని అధికారులను ఆదేశించారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. నిజామాబాద్ జిల్లా మున్సిపల్ మేయర్లు, ఛైర్మన్లు, కమిషనర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో, మున్సిపాలిటీలలో చెత్త నిర్వహణ, డ్రై రిసోర్స్ సెంటర్, కంపోస్ట్ మెనేజ్మెంట్, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో నగర మేయర్ నీతూ కిరణ్, మున్సిపల్ కమిషనర్ జితేశ్.వి.పాటిల్, పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది, మున్సిపల్ ఇంజినీర్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి: విలీన గ్రామాలకు విముక్తి.. అసెంబ్లీలో సవరణ బిల్లు!