ETV Bharat / state

KTR Comments On BJP And Congress : 'బీజేపీని గల్లాపట్టి గల్లీలో నిలదీయాలి.. డిపాజిట్లు గల్లంతు చేసి మోదీకి బుద్ధి చెప్పాలి' - బీజేపీపై విమర్శలు చేసిన కేటీఆర్​

KTR Comments On BJP And Congress : గత 60 ఏళ్లలో చూడని అభివృద్ధిని.. ఈ 9 ఏళ్లలో చూస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ హర్షించారు. అభివృద్ధి చేసే వారిని కులమతాలకు అతీతంగా గెలిపించాలని.. ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చే వారిని ప్రజలు అసలు నమ్మెద్దని అన్నారు. నిజామాబాద్​లో జరుగుతున్న బీఆర్​ఎస్​ పార్టీ సభలో పాల్గొని ప్రసంగించారు.

KTR Fire On MP Dharmapuri Arvind
KTR Comments On BJP And Congress
author img

By

Published : Aug 9, 2023, 5:17 PM IST

Updated : Aug 9, 2023, 7:30 PM IST

KTR Comments On BJP And Congress : 'బీజేపీని గల్లాపట్టి గల్లీలో నిలదీయాలి.. డిపాజిట్లు గల్లంతు చేసి మోదీకి బుద్ధి చెప్పాలి'

KTR Comments On BJP And Congress : బీజేపీని గల్లా పట్టి గల్లీలో నిలదీయాలని.. డిపాజిట్లు గల్లంతు చేసి మోదీకి బుద్ధి చెప్పాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​​(KTR) విమర్శించారు. అభివృద్ధి చేసే వారిని కులమతాలకు అతీతంగా గెలిపించాలని.. ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చే వారిని ప్రజలు అసలు నమ్మెద్దని​ అన్నారు. నిజామాబాద్​లో ఐటీ టవర్(Nizamabad It Tower)​​ను ప్రారంభించిన.. అనంతరం పాలిటెక్నిక్​ కళాశాల మైదానంలో జరిగిన బీఆర్​ఎస్(BRS)​ పార్టీ సభలో పాల్గొని ప్రసంగించారు.

'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అని దాశరథి జైల్లో బొగ్గుతో రాశారని.. అలాంటి పట్టణానికి రూ.50 కోట్లతో కళాభారతి నిర్మిస్తామని మంత్రి కేటీఆర్​ హామీ ఇచ్చారు. ఒకప్పుడు నెర్రలు వారిన నేలల్లో నేడు జలధారలు పారుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్​ను అధిగమించామని.. ఇక్కడ ధాన్యం ఉత్పత్తి 60 వేల టన్నుల నుంచి 3.5 లక్షలకు చేరిందని ఆనందించారు.

KTR Fires at Central Government : 'నేతన్నలపై.. రాష్ట్ర సర్కార్ వరాల జల్లు '

KTR Fire On MP Dharmapuri Arvind : గత 60 ఏళ్లలో చూడని వాటిని ఈ 9 ఏళ్లలో చూస్తున్నామన్నారు. పెద్దలకు గౌరవించడం హిందూ సంప్రదాయం, ఆధునికుల నాగరికత అని కేటీఆర్​ హితబోధ చేశారు. అలాంటిది నిజామాబాద్​ ఎంపీకి పెద్దలను గౌరవించటం కూడా తెలియదని విమర్శించారు. మతం గురించి మాట్లాడి రెచ్చగొట్టడం ఒక్కటే ఎంపీ అర్వింద్​కు తెలుసని ధ్వజమెత్తారు. ప్రతిదానికి హిందూ, ముస్లిం అని మాట్లాడుతూ ప్రజల మధ్య విద్వేషాలు పెంచుతున్నారన్నారు. ఈసారి అర్వింద్​ ఎక్కడ నుంచి పోటీ చేసిన డిపాజిట్లు గల్లంతు అవ్వడం ఖాయమని హెచ్చరించారు.

గ్యాస్​ సిలిండర్ ధర​ రూ.450 ఉన్నప్పుడు సిలిండర్​కు మొక్కాలని ఆనాడు మోదీ అన్నారని.. కానీ ఇవాళ అదే సిలిండర్​ ధర రూ.1200కు మోదీ పెంచారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరగటం వల్లే అన్ని నిత్యావసరాల ధరలు పెరిగాయని మంత్రి కేటీఆర్​ హెచ్చరించారు. కాంగ్రెస్​ వాళ్లు కూడా కేసీఆర్​ మీద ఎగబడి మాట్లాడుతున్నారని.. కొత్తగా ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అంటున్నారని ఎద్దేవా చేశారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్నది వాళ్లే కదా అని మంత్రి కేటీఆర్​ గుర్తు చేశారు.

KTR on Agriculture Sector : 'ప్రపంచంలో దేన్ని ఆపగలిగినా.. వ్యవసాయ రంగాన్ని మాత్రం ఆపలేం'

"ప్రజలు సంతోషంగా ఉంటే ప్రతిపక్షాలకు చూడబుద్ధి ఐతలేదు. కాంగ్రెస్ వాళ్లు కూడా కేసీఆర్ మీద ఎగబడి ఎగబడి మాట్లాడుతున్నారు. కొత్తగా ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అంటున్నది. 50 ఏళ్లు అధికారంలో ఉన్నది వాళ్లే కదా? ఉద్యమకారుల మీదకు రైఫిల్ తీసుకుని వెళ్లిన రేవంత్ రెడ్డి తెలంగాణ వాదిని అంటున్నాడు. మూడు గంటల కరెంట్ ఇస్తానన్న కాంగ్రెస్ పార్టీనా.. మూడు పంటలకు నీళ్ళు ఇస్తున్న కేసీఆర్​నా.. మతాల మధ్య మంటలు పెడుతున్న బీజేపీనా.. ఎవరు కావాలో ఆలోచించుకోవాలి." - కేటీఆర్​, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి

కేసీఆర్​ ఆశీర్వాదంతో నిజామాబాద్​ అభివృద్ధి : సీఎం కేసీఆర్​ ఆశీర్వాదంతోనే నిజామాబాద్​ నగరం అభివృద్ధి జరిగిందని మంత్రి కేటీఆర్​ అన్నారు. రూ.50 కోట్లతో ఐటీ హబ్​ నిర్మించి స్థానికులకు ఉద్యోగాలు కల్పించామన్నారు. రూ.11 కోట్లతో న్యాక్​ భవనాన్ని నిర్మించామని తెలిపారు. భవన నిర్మాణ రంగంలో పని చేసేవారికి ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతోందని వివరించారు. రూ.7 కోట్లతో నిజామాబాద్​ మున్సిపల్​ భవనాన్ని నిర్మించామని.. హైదరాబాద్​లో ట్యాంక్​ బండ్​ను తలపించేలా రఘునాథ చెరువును మినీ ట్యాంక్​ బండ్​ను తీర్చిదిద్దామని తెలిపారు. రూ.17.5 కోట్లతో మూడు వైకుంఠదామాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దామని కేటీఆర్​ వెల్లడించారు.

KTR To Inaugurate Nizamabad IT Hub : నిజామాబాద్​లో​ ఐటీ టవర్​ను ప్రారంభించిన కేటీఆర్.. నిరుద్యోగులకు హామీ​

MLC Kavitha Challenge to MP Aravind : ఎంపీ అర్వింద్​కు కవిత 24 గంటల డెడ్​లైన్

Last Updated : Aug 9, 2023, 7:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.