నిజామాబాద్ జిల్లా ఎడపల్లి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం వండే కార్మికులు ధర్నాకు దిగారు. మధ్యాహ్న భోజనం వండే వారికి నెలకు రూ. 21 వేల జీతం, విద్యార్థికి రూ. 15 మెనూ ఛార్జీలు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మధ్యాహ్నం భోజనం వండే వారిని శాశ్వత ఉద్యోగుల ప్రాతిపదికన విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి... తమ డిమాండ్లను పరిశీలించాలని కోరారు.
ఇవీ చూడండి: తెలంగాణలో కరోనా లేదు: ఈటల