ETV Bharat / state

మళ్లీ కొవిడ్ విజృంభణ.. అప్రమత్తతే ఔషధమని నిపుణుల సూచన - telangana corona cases updates

రాష్ట్రంలో ఎనిమిది నెలల తర్వాత శుభకార్యాలు జోరందుకోవడం వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారు. కరోనా ప్రభావం తగ్గిందని బహిరంగ ప్రదేశాల్లోనూ మాస్కు ధరించడం మానేశారు. నిర్లక్ష్యం ఆవహించి శానిటైర్ల వాడకం కూడా తగ్గించారు. రాష్ట్రంలో పలుచోట్ల శుభకార్యాలకు వెళ్లిన వారిపై మహమ్మారి మూకుమ్మడిగా దాడి చేసి మళ్లీ విజృంభించడానికి రెడీగా ఉన్నానని రుజువు చేసింది. మరోవైపు యూకే స్ట్రెయిన్​ కేసులు కూడా రోజురోజుకు పెరుగుతుండటం వల్ల అప్రమత్తతే అసలైన ఔషధమని నిపుణులు సూచిస్తున్నారు.

medical-experts-suggested-to-be-aware-of-corona-virus
మరోసారి కొవిడ్ విజృంభణ
author img

By

Published : Jan 5, 2021, 11:27 AM IST

కరోనా దృష్ట్యా ఎనిమిది నెలల పాటు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు అన్నీ వాయిదా వేశారు. రెండు నెలలుగా శుభకార్యాల జోరు పెరగడం వల్ల ఎక్కడ చూసినా విందు సందడే కనిపిస్తోంది. కరోనా కాలంలో ఇంటికే పరిమితమైన వేడుకలు ఇప్పుడు ఫంక్షన్ హాళ్లకు చేరాయి. భౌతిక దూరం, కొవిడ్ నిబంధనలు పక్కన పెట్టి వేడుకలకు హాజరైన వారిపై ఒక్కసారిగా కరోనా మూకుమ్మడి దాడి చేసింది.

అప్పుడు ప్రాణభయం.. ఇప్పడు నిర్లక్ష్యం

కరోనా కాలంలో మాస్క్, శానిటైజర్ లేకుండా ఏ వ్యక్తీ ఇంటి గడప దాటలేదు. నమస్కారం తప్ప కరచాలనం కనిపించలేదు. ఎవరితో మాట్లాడాలన్నా... భౌతిక దూరం పాటించారు. తెలియని వారు పక్కకు వస్తేనే అనుమానంతో భయపడి పోయారు. అవసరం ఉంటే తప్ప ఎవర్నీ కలవలేదు. కానీ ఇప్పుడు వీటన్నింటికీ మంగళం పాడేశారు. బహిరంగ ప్రదేశాల్లోనే మాస్కులు ధరించడం మానేశారు. కరోనా వచ్చినా ఏం కాదులే అన్న నిర్లిప్తత ఆవరించింది. ప్రారంభంలో ప్రాణభయంతో బెంబేలెత్తిన వారు.. ఇప్పుడు పాజిటివ్ వస్తే ఇంట్లో ఉంటే సరిపోతుందిగా అనే సమాధానాలు వినిపిస్తున్నాయి

రోజుకు 15కి పైగా కేసులు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పదిహేను రోజుల నుంచి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొన్ని రోజుల క్రితం రెండు జిల్లాల్లో 5 కేసులు నమోదయ్యేవి ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపయింది. నిజామాబాద్ జిల్లాలో ప్రతి రోజూ 15కు తగ్గకుండా కేసులు నమోదవుతుండగా.. కామారెడ్డి జిల్లాలో 10 మందికి పైగా మహమ్మారి బారిన పడుతున్నారు.

అప్రమత్తత అవసరం

నిజామాబాద్ జిల్లాలో మొత్తం 1,37,871 కొవిడ్ పరీక్షలు చేశారు. ఇందులో 1,32,588 రాపిడ్ పరీక్షలు, 5283 ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఉన్నాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 15,345గా ఉంది. కామారెడ్డి జిల్లాలో మొత్తం 1,48,699 కొవిడ్ పరీక్షలు చేయగా.. ఇందులో రాపిడ్ పరీక్షలు 1,38,456, ఆర్టీపీసీఆర్ పరీక్షలు 1,02,43 ఉన్నాయి. మొత్తం పాజిటివ్ కేసులు 13475గా నమోదయ్యాయి. యూకే నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు 31మంది రాగా.. అందరినీ గుర్తించి పరీక్షలు నిర్వహించారు. అందరికీ నెగటివ్ వచ్చినా అప్రమత్తత తప్పదని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు.

మరోసారి ప్రమాదం

కేసులు పెరుగుతున్నందున నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి కరోనా నిబంధనలు పాటిస్తూ పనులు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. లేదంటే మరోసారి పెను ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.