మల్లాపూర్ శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం మల్లాపూర్లో ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి ఊరేగించారు.
కల్యాణోత్సవానికి గ్రామాభివృద్ధి కమిటీ , పంచాయతీ పాలకవర్గ సభ్యులు హాజరయ్యారు. అంతకుముందు గ్రామ సర్పంచ్ సత్యనారాయణ చేయించిన పుస్తెలు, మెట్టెలకు ప్రత్యేక పూజలు చేసి ఆలయానికి తీసుకొచ్చారు. వందల సంఖ్యలో తరలివచ్చిన భక్తుల కోలాహాలం నడుమ కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.