మహా శివరాత్రి పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల్లోని శివాలయాలు భక్తిశ్రద్ధలతో మార్మోగాయి. శివయ్య కల్యాణ మహోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి... ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముప్కాల్‌లో పడిలేచిన మర్రిచెట్టు వద్ద, పోచంపాడ్‌లోని శ్రీరామలింగేశ్వరస్వామి మందిరం, వెల్గటూర్‌లోని రాజరాజేశ్వరస్వామి మందిరం వద్ద అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఉపవాస దీక్షలో ఉన్న భక్తులు శివాలయాలకు వచ్చి భోజనాలు చేశారు.
ఇదీ చదవండి: ఏపీకి కష్టం వచ్చిందని మేం నోరు మెదపకుండా ఉంటే ఎలా?: కేటీఆర్