నిజామాబాద్ జిల్లాలో లాక్డౌన్ పటిష్ఠంగా అమలవుతోంది. ఉదయం పది గంటల నుంచే పోలీసులు ప్రధాన రహదారులు, కూడళ్లలో బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజల రాకపోకలను కట్టడి చేస్తున్నారు. వచ్చిపోయే వారిని తనిఖీలు చేస్తూ అత్యవసరం ఉంటేనే వదులుతున్నారు. మిగతావారిని తిప్పి పంపిస్తున్నారు. వాహనాలను సీజ్ చేస్తున్నారు.
అనవసరంగా రోడ్ల మీదకు వచ్చే ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నగరంలోని కంఠేశ్వర్ రోడ్డు, హైదరాబాద్ రోడ్డు, ఖిల్లా రోడ్డు, వర్ని రోడ్డులో బారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. అత్యవసర సేవల కోసం వెళ్తున్న వారిని మాత్రమే అనుమతిస్తున్నారు.
ఇదీ చదవండి : 'గాంధీలో మృత్యుంజయులు 44,335 మంది'