Locals rescued a woman: నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్‌లోని పుష్కర్ ఘాట్ వద్ద స్నానం చేయడానికి వచ్చిన ఓ మహిళ నీటిలో మునిగిపోతుండగా అక్కడున్నవారు రక్షించారు. నిర్మల్ జిల్లాకు చెందిన దంపతులిద్దరూ కార్తీక మాసం సందర్భంగా గోదావరి నదికి వచ్చారు. వారు గంగ స్నానం చేస్తుండగా, ఆ మహిళ నీటిలో మునిగిపోవడాన్ని ఆర్మూర్‌కి చెందిన కొంతమంది వ్యక్తులు గమనించారు. వెంటనే ఆమెను సురక్షితంగా రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చి నీటిని కక్కించారు. కాసేపటికి ఆ మహిళ స్పృహలోకి వచ్చి కోలుకుంది.
ఇవీ చదవండి: