ETV Bharat / state

'ఆధార్​ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ టీకా వేయాలి' - letter to dmho by citu on corona conditions in nizamabad

నిజామాబాద్​ జిల్లాలో వ్యాక్సిన్​ కొరతను నివారించి ప్రతి ఒక్కరికీ టీకాను వేయాలని సీఐటీయూ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్​ చేసింది. కరోనా పరీక్షా కేంద్రాలను పెంచాలని డీఎంహెచ్​ఓ కార్యాలయం ఎదుట సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

letter to dmho by citu
సీఐటీయూ ఆధ్వర్యంలో డీఎంహెచ్​ఓకు వినతి పత్రం
author img

By

Published : May 10, 2021, 7:17 PM IST

ఆన్​లైన్​ రిజిస్ట్రేషన్​ విధానం రద్దు చేసి, ఆధార్​ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా కరోనా టీకా వేయాలని సీఐటీయూ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్​ చేసింది. ఈ మేరకు నిజామాబాద్​ జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్​ఓ కార్యాలయం ఎదుట సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జిల్లా వైద్యాధికారికి వినతిపత్రం అందజేశారు. ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపల్​ వార్డుల్లో కరోనా టెస్ట్​ కేంద్రాలను ఏర్పాటు చేసి అందరికీ పరీక్షలు చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్​ కోరారు.

అన్ని ప్రభుత్వ, ప్రైవేట్​ ఆస్పత్రులు, రైతు వేదికలను ఐసోలేషన్​ కేంద్రాలుగా మార్చాలని నూర్జహాన్​ విన్నవించారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 50 పడకలను ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లాలో వ్యాక్సిన్​ కొరతను నివారించి ప్రతి ఒక్కరికీ టీకా వేయాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి: 'మీలో మీరు బాధపడకండి.. మమ్మల్ని సంప్రదించండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.