ఈ మధ్య పొల్లాలో పెద్ద పులి, చిరుత పులుల సంచారం పెరిగింది. తాజాగా నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం సావేల్ గ్రామంలో చిరుత పులి కలకలం సృష్టించింది. పంట పొలాలకు వెళ్లిన రైతులకు చిరుత కనపడడం వల్ల వారు భయాందోళనకు గురయ్యారు. పంటపొలల్లోకి ఎవరూ వెళ్లొద్దని చాటింపు వేశారు. చిరుత కోసం అటవీ శాఖ అధికారులు బోను ఏర్పాటు చేశారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి: పెద్దపల్లిలో పెద్దపులి సంచారం.. అప్రమత్తంగా ఉండాలి : అటవీ శాఖ