విరసం నేత వరవరరావు, ప్రొఫెసర్ సాయిబాబాలను విడుదల చేయాలంటూ నిజామాబాద్ నగరంలోని ఎన్ఆర్ భవన్లో వామపక్ష సంఘాలు నిరసన దీక్ష నిర్వహించాయి. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే నెపంతో సాయిబాబా, వరవర రావులను అరెస్టు చేయడం దారుణమని వామపక్ష నాయకులు భూమన్న మండిపడ్డారు.
ప్రస్తుతం వారు అనారోగ్యంతో బాధపడుతున్నారని వారిపై కేసులు ఉంటే కోర్టులో హాజరుపరచాలే కానీ జైల్లో నిర్బంధించి వారి గొంతుకను నొక్కేయడం సరికాదని ఆరోపించారు. తక్షణమే వారికి మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేయాలని ప్రభుత్వానికి కోరారు.
ఇవీచూడండి: వర్సిటీల ప్రైవేటీకరణకు ప్రభుత్వ కుట్ర: భట్టి