నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బస్ డిపో-1 వద్ద వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేశారు. వారిని అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేసి వన్ టౌన్ స్టేషన్కు తరలించారు. మోదీ సర్కార్ బ్రిటీష్ ప్రభుత్వం కంటే దారుణంగా ప్రజలను వంచిస్తోందని ఆందోళనకారులు ఆరోపించారు. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్నారని వామపక్ష నేతలు మండిపడ్డారు. మోదీ సర్కార్ అవలంభిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసించాలని డిమాండ్ చేశారు.
అరెస్టయిన వారిలో సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్ బాబు, జిల్లా నాయకులు పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్, లతా, సీపీఐ జిల్లా కార్యదర్శి భూమయ్య, న్యూ డెమోక్రసీ నేతలు ప్రభాకర్, పాపయ్య, సాయిగౌడ్ తదితరులు ఉన్నారు.
- ఇదీ చదవండి : 'ప్లాస్మా దాతలు ముందుకు రావాలి'