నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో.. హాథ్రస్ ఘటనకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. హాథ్రస్ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు.
యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు, ఎస్సీ,ఎస్టీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.