ETV Bharat / state

ఏడు కుటుంబాలు ఒకదిక్కు.. ఊరంతా ఒకదిక్కు! - భూవివాదం కేసు

పదిహేను సంవత్సరా క్రితం అదొక బీడు భూమి. గ్రామంలోని ఏడు కుటుంబాలకు 20 ఎకరాల భూమిని సాగు చేసుకోమని ఇచ్చింది. అప్పటి నుంచి ఆ కుటుంబాలు ఆ భూమి మీదే ఆధారపడి జీవిస్తున్నారు. కొంతకాలం తర్వాత ఆ భూమిని గ్రామ అవసరాల కోసం వాడుకోవాలని గ్రామస్థులు తీర్మానించారు. అప్పుడు మొదలైన కొట్లాట.. ఇప్పుడు పోలీస్​ స్టేషన్​ దాకా వెళ్లింది.

Land Issue In Nizamabad District Indalvai Mandal
ఏడు కుటుంబాలు ఒకదిక్కు.. ఊరంతా ఒకదిక్కు!
author img

By

Published : Jun 26, 2020, 11:41 AM IST

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల పరిధిలోని లోలం గ్రామంలో ఏడు కుటుంబాలకు, గ్రామస్తులకు మధ్య భూ వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. గ్రామంలోని సర్వే నెంబర్ 230లో దాదాపు 80 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులోంచి 20 ఎకరాల భూమిని ప్రభుత్వం 2005లో ఏడు కుటుంబాలకు పంపిణీ చేసింది. ఆ భూమిలో తాము పంట వేసుకుంటామని ఏడు కుటుంబాలకు చెందిన సభ్యులు వాదిస్తున్నారు. ఇదిలా ఉండగా.. 2000 సంవత్సరంలో ఈ స్థలాన్ని గ్రామ అవసరాల కోసం వాడుకోవాలని గ్రామస్థులంతా కలిసి తీర్మానించినట్లు గ్రామాభివృద్ధి కమిటీ చెబుతోంది. ఈ స్థలాన్ని గ్రామంలోని పశువులు మేపడానికి, సంత నిర్వహించడానికి వాడుతున్నామని గ్రామస్థులు చెప్తున్నారు. ఆ భూమి కోసం.. ఇప్పుడు గ్రామంలో గొడవలు ప్రారంభమయ్యాయి. ఏడు కుటుంబాలు ఒకవైపు.. గ్రామం మొత్తం ఒకవైపుగా చేరి పరస్ఫరం గొడవలకు దిగుతున్నారు.

వారం రోజుల క్రితం పట్టాదారుగా చెప్తున్న ఏడుగురు మహిళలు స్థానిక పోలీస్ స్టేషన్లో తమ భూమి బలవంతంగా ఆక్రమించుకున్నారని గ్రామాభివృద్ధి కమిటీ మీద ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలిసిన గ్రామస్థులంతా ఒక్కటయ్యారు. అందరూ కలిసి ఐదు ట్రాక్టర్లలో పోలీస్ స్టేషన్​కు చేరుకొని ఉన్న విషయం పోలీసులకు చెప్పారు.

గ్రామ ప్రజల సమక్షంలో సరిహద్దులు గుర్తించిన తర్వాత ఓ వ్యక్తి మళ్లీ కలుగజేసుకొని వివాదాన్ని మొదటికి తెచ్చాడు. అప్పటి నుంచి గొడవ పెరిగిందని గ్రామస్థు చెప్తున్నారు. గ్రామస్తులంతా స్టేషన్​కు తరలిరావడం వల్ల విషయాన్ని ఎస్సై శివప్రసాద్ రెడ్డి తహశీల్దార్ రమేష్ దృష్టికి తీసుకెళ్లారు. స్టేషన్​కు చేరుకున్న తహశీల్దార్ ఇరు వర్గాలతో మాట్లాడారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి ఉన్నతాధికారుల ఆదేశాలతో సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తానని తెలిపారు. అప్పటి వరకు రెండు వర్గాలు వివాదాస్పద భూమిలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టరాదని ఆదేశించారు.

ఇవీ చూడండి: పచ్చని పండుగ: హరిత తెలంగాణే లక్ష్యం... ప్రతిమొక్కనూ బతికిద్దాం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.