ETV Bharat / state

నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారో? - kcr

పట్టభద్రుల శాసనమండలి సభ్యునిగా తనను గెలిపించి మండలిలో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇవ్వాలని జీవన్ రెడ్డి కోరారు. ప్రభుత్వ అసమర్థ విధానాలను ఎండగట్టేందుకు గెలిపించాలని ఆయన అన్నారు.

నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారో?
author img

By

Published : Mar 13, 2019, 7:44 PM IST

బాల్కొండ నియోజకవర్గం కిసాన్​నగర్ గ్రామంలో మాజీ మంత్రి జీవన్​రెడ్డి పాత్రికేయ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్​ మాజీ విప్ అనిల్ ఈరవత్రి ఇంట్లో జరిగిన సమావేశంలో జీవన్ రెడ్డి తెరాస ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేసీఆర్​ హామీ ఇచ్చిన విధంగా నిరుద్యోగ భృతి, ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, మధ్యంతర భృతి ఎప్పుడు అమలవుతాయో ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు.

విలీనాలను ప్రోత్సహిస్తున్నారు...

శాసనమండలిలో ఉన్న కాంగ్రెస్ సభ్యులను తెరాసలో విలీనం చేసుకొని ప్రతిపక్షానికి ప్రాతినిధ్యం లేకుండా పరిపాలించుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని జీవన్​ రెడ్డి అన్నారు. తనను పట్టభద్రుల కోటాలో ఎమ్మెల్సీగా గెలిపించి... ప్రభుత్వ అసమర్థ విధానాలను ఎండగట్టేందుకు అవకాశం కల్పించాలని కోరారు.

పట్టభద్రుల శాసనమండలి సభ్యునిగా తనను గెలిపించండి

ఇవీ చూడండి:కేసీఆర్​తో సబిత మంతనాలు...

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.