ETV Bharat / state

తూనికలు, కొలతల అధికారుల దాడులు - నిజామాబాద్​ జిల్లా తాజా వార్తలు

నిజామాబాద్ నగరంలోని పలు మాంసం దుకాణాల్లో తూనికలు, కొలతల శాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేసి తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న దుకాణాదారులపై కేసులు నమోదు చేసి, జరిమానా విధించారు.

Inspections of weights and measures officers on meat shops
తూనికలు, కొలతల అధికారుల దాడులు, నిజామాబాద్​ జిల్లా తాజా వార్తలు
author img

By

Published : May 2, 2021, 3:19 PM IST

నగరంలో పలు దుకాణాల్లో వ్యాపారులు వినియోగిస్తున్న ఎలక్ట్రానిక్‌ కాంటాల్లో అక్రమాలను గుర్తించినట్లు... నిజామాబాద్​ జిల్లా తూనికల, కొలతల అధికారి శ్రీనివాసులు తెలిపారు. మాంసం దుకాణాలపై ఆకస్మికంగా దాడులు చేసి తనిఖీలు నిర్వహించారు.

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న 27 దుకాణాదారులపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వారి నుంచి రూ. 26,500 జరిమానా వసూలు చేసినట్లు వివరించారు. అనంతరం దుకాణాల్లోని కాంటాలు సరిచేసి ముద్రలు వేశామన్నారు.

ఇదీ చదవండి: యాంకర్​ ప్రదీప్​ కుటుంబంలో తీవ్ర విషాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.