నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఆర్టీసీ సమ్మెలో భాగంగా కార్మికులు అంబేడ్కర్ చౌరస్తా నుంచి బస్ డిపో వరకు కుటుంబ సభ్యులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. డిపో ముందు ధర్నా చేపట్టారు. అనంతరం ఆత్మహత్య చేసుకున్న కార్మికులకు నివాళులర్పించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే షకీల్ అహ్మద్‌ను కలిసి తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని విన్నవించారు.
ఇదీ చూడండి:- గాంధీ ఎలా 'ఆత్మహత్య' చేసుకున్నారో మీకు తెలుసా?