నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎందరో మహానుభావుల త్యాగాల వల్ల స్వాతంత్ర్యం వచ్చిందని మంత్రి అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జడ్పీ ఛైర్మన్ విఠల్‌రావు, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్‌గుప్తా, ఎమ్మెల్సీ రాజేశ్వర్, డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, కలెక్టర్ సి. నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల వారికి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని.. ఆసరా, కల్యాణలక్ష్మి, పేద విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్, రైతు బంధు, రైతు బీమా.. ఇలా అనేక పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి అన్నారు. కాళేశ్వరం ద్వారా తెలంగాణలో ప్రతి ఎకరానికి నీరందించే లక్ష్యం పూర్తవుతోందన్నారు.
ఇవీ చూడండి: ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలు