నిజామాబాద్ జిల్లా ఆచన్‌పల్లిలోని ఇందూరు హైస్కూల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్‌రావు ప్రారంభించారు. ఈ ల్యాబ్ కోసం నీతి ఆయోగ్ రూ.12 లక్షలను విడుదల చేసిందని తెలిపారు. విద్యార్థుల్లో సాంకేతికతను పెంపొందించేందుకు ఈ ల్యాబ్ ఉపయోగపడుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కిశోర్‌కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యార్థుల ఆవిష్కరణలను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి గంగా కిషన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇవీచూడండి: 'తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తుంది'