ETV Bharat / state

అయోధ్య సైకిల్ యాత్రకు వర్నిలో స్వాగతం

నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నుంచి అయోధ్యకు చేపట్టిన సైకిల్ యాత్రకు వర్ని మండల కేంద్రంలో హిందూ బంధువులు ఘన స్వాగతం పలికారు. వారికి అల్పాహారం ఏర్పాటు చేశారు. మందిర నిర్మాణానికి వెండి ఇటుకలు, పాదుకలను తీసుకెళ్తున్నట్లు గురుస్వామి వెల్లడించారు.

అయోధ్య సైకిల్ యాత్రకు వర్నిలో స్వాగతం
అయోధ్య సైకిల్ యాత్రకు వర్నిలో స్వాగతం
author img

By

Published : Mar 19, 2021, 6:51 PM IST

నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నుంచి అయోధ్య రామాలయానికి నిర్వహిస్తున్న సైకిల్ యాత్రకు వర్ని మండల కేంద్రంలో హిందూ బంధువులు ఘన స్వాగతం పలికారు. రామమందిర నిర్మాణానికి వెండి ఇటుకలు, పాదుకలు తీసుకెళ్తున్నట్లు గురుస్వామి వినయ్ వెల్లడించారు. అయోధ్యకు 33 మంది యాత్ర చేపట్టారు.

సుఖశాంతులతో..

యాత్ర 1,400 కిలోమీటర్లు సాగుతుందని.. రోజుకు 60 కిలోమీటర్ల చొప్పున 23 రోజుల తర్వాత అయోధ్యకు చేరుకుంటామని వెల్లడించారు. 'సువర్ణ భూమి శ్రీరామరక్ష సైకిల్ యాత్ర' పేరుతో యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు సుఖశాంతులతో ఉండాలనే చేస్తున్నట్లు పేర్కొన్నారు.

అల్పాహారం ఏర్పాటు..

యాత్రకు భాజపా నియోజకవర్గ నాయకులు మల్యాద్రి రెడ్డి దొరబాబు, సుబ్రమణ్య స్వామి, మాజీ జడ్పీటీసీ రంజాన్ నాయక్, మండల అధ్యక్షుడు శంకర్, సహకార సంఘం మాజీ అధ్యక్షుడు వీర్రాజు, గోవర్దన్ స్వాగతం పలికారు. వారికి అల్పాహారం ఏర్పాటు చేశారు. వసంత గురు స్వామి, మేక శ్రీనివాస్, శ్రీరామ మాలధారణ భక్తులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: పట్టభద్రుల ఒగ్గు కళా ప్రదర్శనలు చూద్దాం రండి!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.