నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. భీముడు... బకాసురుడిని వధించిన స్థలం అయిన రాకాసిపేట్లోని భీముని ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పట్టణ పెద్దలు, ఆర్య సమాజ్ సభ్యులు స్థానిక రేణుక ఎల్లమ్మ ఆలయం నుంచి భీముని ఆలయం వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ హోమం నిర్వహించారు. అనంతరం ఆయుధ పూజ చేశారు. శమీ చెట్టుకి పూజలు చేసి బంధువులకు పంచి పెడ్తూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం శక్కర్ నగర్లోని రాంలీలా మైదానంలో రావణ దహన కార్యక్రమం నిర్వహించారు. రావణ దహనాన్ని చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఇవీ చూడండి: దుర్గా నిమజ్జనంలో విషాదం- ఏడుగురు మృతి