నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన టెలీమెడిసిన్ కంట్రోల్ సెంటర్‌కు మంచి స్పందన వస్తోందని ప్రభుత్వ వైద్యులు విశాల్ తెలిపారు. ఆరోగ్య విషయాల్లో డాక్టర్లకు ఫోన్ చేసి తగు సలహాలు పొందేందుకు ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ప్రజలు దగ్గు, జ్వరం, జలుబు లేదా ఇతరత్రా ఆరోగ్య సమస్యలకు అత్యవసరంగా సలహాలు, సూచనలు అందిస్తున్నారు.
ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కంట్రోల్ రూంలో వైద్యులు అందుబాటులో ఉంటాలని విశాల్ తెలిపారు. నిజామాబాద్ ప్రజలు 8309219718కు, ఆర్మూర్‌లో 9398194337, బోధన్‌లో 9059106663 నెంబరు ఫోన్ చేయాలని కోరారు.
ఇదీ చదవండి: సీఎంకు పీసీసీ కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్ కమిటీ లేఖ