ETV Bharat / state

నిజామాబాద్ కలెక్టరేట్​ను ముట్టడించిన చైతన్య సమితి

నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్​ను గంగపుత్రులు ముట్టడించారు. ఆర్మూర్ పరిధి పిప్రీ గ్రామంలో వీడీసీ తమపై ఆధిపత్యం చెలాయించాలని గ్రామం నుంచి బహిష్కరించిందని మండిపడ్డారు. ఈ మేరకు గ్రామ అభివృద్ధి కమిటీపై అదనపు కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. కమిటీపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించారు.

నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్​ను ముట్టడించిన చైతన్య సమితి
నిజామాబాద్ కలెక్టరేట్​ను ముట్టడించిన చైతన్య సమితి
author img

By

Published : Jul 15, 2020, 12:20 AM IST

నిజామాబాద్ జిల్లా పాలనాధికారి కార్యాలయాన్ని గంగపుత్ర చైతన్య సమితి ముట్టడించింది. ఆర్మూర్ మండలం పిప్రీ గ్రామ అభివృద్ధి కమిటీ.. గంగపుత్ర కుటుంబాలను గత 15 రోజులుగా సామాజిక బహిష్కరణ చేసి, అనేక ఇబ్బందులకు గురిచేస్తోందని అదనపు కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు.

ఏటా రూ.లక్ష ఇమ్మంటున్నారు..

మత్స్యకారులకు ప్రభుత్వం ఉచిత చేపపిల్లల పథకం అమలు చేస్తున్న విషయాన్ని బూచిగా చూపిస్తూ గ్రామ అభివృద్ధి కమిటీ ఏటా తమకు రూ.లక్ష చెల్లించాలని హుకుం జారీ చేసిందని చైతన్య సమితి ఆరోపించింది. వీడీసీ చెప్పిన ధరలకే చేపలను విక్రయించాలంటూ పెత్తనం చెలాయించడంపై జిల్లా పాలనాధికారి కార్యాలయాన్ని సంప్రదించినట్లు తెలిపారు. గ్రామ కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన గంగపుత్రులను సాంఘిక బహిష్కరణ చేయడంపై సమితి ధ్వజమెత్తింది.

గతంలోనే యంత్రాంగం దృష్టికి..

గతంలోనే పిప్రీ వీడీసీ ఆగాడలపై తహసీల్దార్, ఆర్డీవో, డీఎస్పీకి, మత్స్యశాఖకు ఫిర్యాదు చేశామని చైతన్య సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు అల్గోట్ రమేశ్ గంగపుత్ర తెలిపారు. బహిష్కరణపై స్పందించిన ఆర్డీవో, పిప్రీ గ్రామాన్ని సందర్శించి సమస్య పరిష్కరించాలని తహసీల్దార్​కు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఫలితంగా అధికారుల ముందు బహిష్కరణ ఎత్తివేస్తున్నట్లు వీడీసీ ప్రకటించిందన్నారు. అంతర్గతంగా మాత్రం గ్రామ అభివృద్ధి కమిటీ బహిష్కరణ కొనసాగిస్తోందని మండిపడ్డారు.

చర్యలు తీసుకుంటాం..

గంగపుత్రుల సామాజిక బహిష్కరణ నేపథ్యంలో వీడీసీపై గట్టి చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కలెక్టరేట్​లో వినతి పత్రం అందించినట్లు ప్రధాన కార్యదర్శి శంకర్ గంగపుత్ర పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సానుకూలంగా స్పందించి, కమిటీపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారన్నారు. ఈ మేరకు గంగపుత్రులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారన్నారు. మత్స్యకార వృత్తిలో ఉన్న తమను చిన్న చూపు చూడటంపై రాష్ట్ర సహాయ కార్యదర్శి బెస్త నర్సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడీసీ తమ పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.

కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షుడు పూస శ్రీనివాస్ బెస్త, రాష్ట్ర సహాయ కార్యదర్శి బెస్త నర్సింగ్ , సలహాదారులు పూస నర్సయ్య బెస్త, ఉట్నూరు బాలన్న గంగపుత్ర, పల్లికొండ నర్సన్న గంగపుత్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి కస్ప శ్రీనివాస్ గంగపుత్ర, విద్యార్థి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బట్టు శ్రీధర్, పిప్రీ గ్రామ గంగపుత్రులు భూమేష్, రవి, ప్రశాంత్ , మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఇవీ చూడండి : తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్​.రమణ నివాసంలో అఖిల పక్షం నేతల భేటీ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.