ETV Bharat / state

కవిత పుట్టినరోజు వేడుకలు: నిజామాబాద్​లో ఉచిత మెగా వైద్య శిబిరం

author img

By

Published : Mar 13, 2021, 1:12 PM IST

ఎమ్మెల్సీ కవిత పుట్టిన రోజు సందర్భంగా నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా సర్పంచ్​ల కుటుంబీకులకు ఈ శిబిరం ద్వారా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

kavitha birthday celbrations
కవిత పుట్టినరోజు వేడుకలు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు వేడుకలు నిజామాబాద్​లో ఘనంగా జరిగాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్​ హాల్​లో ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా సర్పంచ్​ల ఫోరమ్ ఆధ్వర్యంలో సర్పంచ్​ల కుటుంబ సభ్యులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. హెల్త్ క్యాంప్​ను జడ్పీ ఛైర్మన్ విఠల్ రావు ప్రారంభించారు.

తమ నాయకురాలు కవిత నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలను భగవంతుడిని కోరుకున్నట్లు జడ్పీ ఛైర్మన్​ తెలిపారు. రాష్ట్ర సంస్కృతిని కవిత అంతర్జాతీయస్థాయిలో చాటిచెప్పారని.. బతుకమ్మ ప్రత్యేకతను, బోనాల విశిష్టతను అందరూ గుర్తించేలా కృషిచేశారని విఠల్​రావు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మేయర్ నీతూ కిరణ్, జిల్లా సర్పంచ్​ల ఫోరమ్ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: హ్యాపీ బర్త్​డే కవితక్క.. వినూత్నంగా శుభాకాంక్షల వెల్లువ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.