నిజామాబాద్లో డీసీసీబీ నూతన పాలక వర్గం కొలువుదీరింది. జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్(డీసీసీబీ) కేంద్ర కార్యాలయంలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డితో పాటు, ఉపాధ్యక్షుడు, డైరెక్టర్లతో అధికారులు ప్రమాణం చేయించారు.
నూతన అధ్యక్షుడిగా భాద్యతలు చేపట్టిన భాస్కర్ రెడ్డికి జిల్లా పరిషత్ ఛైర్మన్ విఠల్ రావు, ఇతర నేతలు శుభాకాంక్షలు తెలిపారు. డీసీసీబీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని భాస్కర్ రెడ్డి అన్నారు.
ఇదీ చదవండి : 4వ తరగతి పాసైన బామ్మలకు.. నారీశక్తి పురస్కారం