నిజామాబాద్ జిల్లాలో వరి సన్నరకం ఏపుగా పెరగడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత సాగు విధానం ప్రోత్సహించడం వల్ల కర్షకులు సన్నరకం వరి సాగు చేశారు. అధిక శాతం పొలాల్లో వరి పంట విపరీతంగా పెరుగుతోంది.
సాధారణంగా రెండు అడుగుల మేర పెరగాల్సిన పైరు నాలుగు అడుగుల వరకు పెరిగింది. నందిపేట మండలం బజార్ కొత్తూర్ రైతులు ఎత్తు పెరగకుండా ఉండేందుకు సగం వరకు పైరును కోసేస్తున్నారు.
- ఇదీ చూడండి: హైదరాబాద్లో 6.6 లక్షల మందికి కరోనా!