నిజామాబాద్ జిల్లా బోధన్‌లో కోవిడ్-19 నిబంధనలను పోలీసులు పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. మాస్కులు లేకుండా తిరుగుతున్న వాహనదారులకు జరిమానా వేసి మాస్కులు అందజేస్తున్నారు. ఈరోజు సుమారు 30 మంది వాహనదారులకు జరిమానా వేశామని సీఐ పల్లె రాకేశ్ తెలిపారు.
లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి 1300 వాహనాలను సీజ్ చేశామని పేర్కొన్నారు. ప్రజలు బయటకు వచ్చేటప్పుడు తప్పకుండా మాస్కులు ధరించాలని, ప్రతీ ఒక్కరు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని సూచించారు.