నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం మినార్పల్లిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కోలదీప్లాకు ఇద్దరు కొడుకులుండగా... రెండో కుమారుడు శ్రీనివాస్‌తో కలిసి మద్దికుంట చెరువుకు చేపల వేటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీళ్లలో జారి పడ్డారు. ఇద్దరికీ ఈత రాకపోవటం వల్ల నీళ్లలో మునిగి మృతి చెందారు.
రెక్కాడితే గాని డొక్కా డని దయనీయ పరిస్థితిలో ఉన్న వారి కుటుంబం ఈ ఘటనతో పెద్ద దిక్కును కోల్పోయింది. శ్రీనివాస్‌కి ఐదేళ్ల క్రితం పెళ్లి కాగా.... మూడేళ్ల కూతురు ఉంది. శ్రీనివాస్ భార్య ప్రస్తుతం 4 నెలల గర్భవతి. ఘటనస్థలిలో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.