ETV Bharat / state

crop damage: అకాల వర్షం.. దిక్కుతోచని స్థితిలో రైతులు

author img

By

Published : Apr 25, 2023, 4:47 PM IST

crop damage in nizamabad: ఆరుగాలం కష్టించి పంటలు పండించిన అన్నదాతలను అకాల వర్షాలు కకావికలం చేస్తున్నాయి. పంటను చీడపీడల నుంచి కాపాడుకొని తీరా పంట కోసి కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే వర్షపు నీటికి తడిసిపోతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు రైతన్నలు లబోదిబోమంటున్నారు. భారీ వర్షాలకు ధాన్యం తడిచి, కొట్టుకుపోయి అన్నదాతలు దిక్కుతోచని దయనీయ స్థితిలో పడ్డారు. ఇదే అదనుగా రైస్​ మిల్లర్లు అదనపు కడ్తా అగుడుతున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు.

CROP
CROP

crop damage in nizamabad: అకాల వర్షం రైతులను ఆగం చేసింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్ జిల్లాలను వర్షాలు అతలాకుతలం చేశాయి. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి నట్టేట మునిగామంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. కొంత మంది రైతులు కోతలు కోసి, వడ్ల కుప్పలు పోసి కొనుగోలు కేంద్రాల వద్ద విక్రయాల కోసం ఎదురు చూస్తున్నారు. మరికొంత మంది కోతకు సిద్ధంగా ఉన్నారు.

కొనుగోలు కేంద్రాల దగ్గర కనీస సౌకర్యాలు లేవు: కొనుగోలు కేంద్రాల్లో విక్రయం కోసం తెచ్చిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దవటంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వర్షం వస్తే వరిధాన్యంపై కప్పేందుకు టార్పాలిన్లు, ప్లాస్టిక్ కవర్లు సైతం లేకపోవడంతో ధాన్యం తడిసి పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యంగా వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినందున ఈ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ మండిపడుతున్నారు.

ఏ ఏ ప్రాంతాల్లో తీవ్రంగా రైతులు నష్టపోయారు: ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లోనూ అకాల వర్షం తీరని ఇబ్బందులను మిగిల్చింది. ఆర్మూర్ నియోజకవర్గంలో మాక్లూర్, నందిపేట్, ఆర్మూర్ మండలాల్లో కురిసిన వర్షానికి కల్లాల్లో ఉన్న ధాన్యం తడిచిపోయింది. బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్ మండలంలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి భీంగల్, ముచుకుర్, బడా భీంగల్, బెజ్జోరాతో పాటు పలు గ్రామాల్లో భారీగా వర్షం కురిసింది. దీంతో పూర్తిగా ధాన్యం తడిసిపోయింది. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఒక్కసారిగా పిడిగులాగా పడిన వర్షానికి రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వేడుకుంటున్నారు.

అధికారులు, రైతులకు అండగా ఉండాలని డిమాండ్: తడిసిన, మొలకెత్తిన, రంగు మారిన ధాన్యం ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేపట్టాలని ప్రభుత్వాన్ని రైతులు వేడుకుంటున్నారు. ధాన్యం తడిసిందని అదనంగా రెండు మూడు కిలోలు కడ్తా ఇవ్వమని రైస్ మిల్లర్లు షరతులు పెడుతున్నారని అంటున్నారు. అధికారులు చొరవచూపి రైతుకు అండగా నిలబడి కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కొనుగోళ్లపై రైతులు ఆందోళన చెందుతున్నారు. వేగంగా ప్రక్రియ చేపట్టి రైతులకు నష్టం లేకుండా చూడాలని విన్నవిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు ధాన్యం తడిసిపోయాయని.. వాటికి పరిహారం అందించాలని కోరుతున్నారు.

"వారం నుంచి ప్రతి రోజు సాయంత్రం వర్షం రావడం వల్ల ఎక్కువగా నష్టపోయాం. చేనులో ఉంటే రాళ్లు ఎక్కువవుతున్నాయి. కొనుగోలు కేంద్రాల దగ్గరకి తెస్తే వర్షానికి తడిచిపోయాయి. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోని మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం."- స్థానిక రైతు

అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.