.
Farmers Padayatra: కొనసాగుతున్న రైతుల పాదయాత్ర.. చక్కెర కర్మాగారాలు తెరవాలని డిమాండ్ - రైతు ఐక్య వేదిక
పండించిన పంటలకు గిట్టుబాటు ధర కోరుతూ రైతులు చేపట్టిన పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. జగిత్యాల జిల్లా ముత్యంపేట్ నుంచి నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు వరకు 4 రోజుల పాటు ఈ యాత్ర చేపట్టారు. మెట్పల్లి, కమ్మర్ పల్లి, మోర్తాడ్, వేల్పూర్, ఆర్మూర్ మీదుగా కొనసాగుతోంది. పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర అమలు చేయాలని, మూతబడిన షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. జగిత్యాల రైతు ఐక్య వేదిక, రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేస్తున్న రైతులతో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీశైలం ముఖాముఖి.
పంటలకు గిట్టుబాటు ధర కోరుతూ రైతుల పాదయాత్ర
.