నిజామాబాద్ శివారులోని సహకార చక్కెర పరిశ్రమను పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ పరిశ్రమ పరిరక్షణ కమిటీ పాదయాత్ర చేపట్టింది. నిజామాబాద్ జిల్లా తిర్మన్ పల్లి వద్ద గాంధీ విగ్రహానికి నివాళి అర్పించి.. పాదయాత్ర ప్రారంభించింది.
మొత్తం 29 రోజుల పాటు 90 గ్రామాల్లో పాదయాత్ర సాగనుంది. ఏప్రిల్ 12న నిజామాబాద్ కలెక్టరేట్‌కు పాదయాత్ర చేరుకోనుంది. అదే రోజు కలెక్టరేట్ వద్ద బహిరంగ సభ నిర్వహించి భవిష్యత్ కార్యచరణ ప్రకటించనుంది కమిటీ.
రైతులే వాటాదారులుగా సహకార రంగంలో ఉన్న ఏకైక పరిశ్రమ నిజామాబాద్ షుగర్ ఫ్యాక్టరీ అని పరిరక్షణ కమిటీ సభ్యులు అన్నారు. అప్పులు మాఫీ చేసి ప్రభుత్వమే పరిశ్రమను నడపాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే తమకైనా అప్పగించాలని రైతులు, పరిరక్షణ కమిటీ సభ్యులు కోరారు. ప్రభుత్వం స్పందించే వరకు వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఇవీచూడండి: కృష్ణానదిలో వ్యర్థాలు తొలగించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది