ETV Bharat / state

Farmer Wear Chappal After Turmeric Board : పసుపు బోర్డు వచ్చింది.. కాలికి చెప్పులు వచ్చాయ్​..! - Turmeric Farmer Manohar barefoot for 12 years

Farmer Wear Chappal After Turmeric Board: ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్​ జిల్లాకు పసుపు బోర్డు కేటాయిస్తున్నట్లు చేసిన ప్రకటనతో ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న పసుపు రైతుల కల నెరవేరింది. దశాబ్దాలుగా కర్షకులు చేస్తున్న పోరాటం ఫలించినట్టైంది. ఈ కల నెరవేరిన వేళ ఓ రైతు ఏళ్ల తరబడి చేస్తున్న దీక్షకు తెర పడింది. 12 ఏళ్లుగా చేస్తున్న దీక్షకు ప్రధాని పసుపు బోర్డు ప్రకటనతో ఆ రైతు ముగింపు పలికాడు. ఇంతకీ ఆ రైతు చేసిన దీక్ష ఏంటి..? దాని కథేంటో తెలుసుకుందామా..?

Turmeric Board in Nizamabad
Turmeric Farmer initiation Closed
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 2, 2023, 2:35 PM IST

Farmer Wear Chappal After Turmeric Board : మహబూబ్​నగర్​లో ఆదివారం జరిగిన ప్రజాగర్జన సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజలపై వరాల వర్షం కురిపించారు. ముఖ్యంగా దశాబ్దాలుగా పసుపు రైతులంతా ఎదురుచూస్తున్న కలను నెరవర్చే ఓ కీలక ప్రకటన చేశారు. అదే పసుపు బోర్డు. జాతీయ పసుపు బోర్డును మంజూరు చేస్తున్నట్లు పాలమూరు సాక్షిగా మోదీ ప్రకటించారు. ప్రధాని ప్రకటనతో ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న రైతులు సంతోషంలో మునిగిపోయారు. అయితే దశాబ్దాల కల నెరవేరిన వేళ ఓ రైతు 12 ఏళ్లుగా పసుపు బోర్డు కోసం చేస్తున్న దీక్షను విరమించారు. ఇంతకీ ఆ రైతు చేస్తున్న దీక్ష ఏంటి..? దాని సంగతేంటి..?

Turmeric Farmer Manohar barefoot for 12 years : నిజామాబాద్​ జిల్లా మోర్తాడ్‌ మండలం పాలెం గ్రామానికి చెందిన పసుపు రైతు ముత్యాల మనోహర్‌రెడ్డి పసుపు పంటకు గిట్టుబాటు ధరలేక.. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఏళ్ల నుంచి ఆవేదన చెందుతూనే ఉన్నారు. దశాబ్దాల కాలం నుంచి పసుపు పంటకు కనీస మద్దతు ధర(msp) ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేస్తూ వస్తున్నారు. దానికోసం ఎన్నో ఆందోళనలు, నిరసనలు, దీక్షలు చేశారు. అయినా ప్రభుత్వం తరఫున ఎలాంటి స్పందన లేదు. పసుపు రైతులకు న్యాయం చేయడంలో.. పసుపు బోర్డు ఏర్పాటులో.. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో మనోహర్ రెడ్డి దీక్ష బూనారు.

Farmers Celebrations Over Turmeric Board Telangana : దశాబ్దాల కల నెరవేరిన వేళ.. పసుపు బోర్డు ప్రకటనతో రైతుల సంబురాలు

Turmeric Board Gets Footwear Back to Farmer : పసుపు బోర్డు ఏర్పాటు చేసే అంత వరకు తన కాళ్లకు చెప్పులు వేసుకోకుండా ఉంటాని మనోహర్ రెడ్డి దీక్షబూనారు. 2011 నవంబర్​ 4వ తేదీ నుంచి ఈ దీక్ష చేస్తున్నారు. బోర్డు ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చారు. 2013 ఆర్మూర్ నుంచి తిరుపతి వరకు కాలినడకన వెళ్లి.. వేంకటేశ్వర స్వామిని వేడుకున్నారు.

Turmeric Board in Telangana 2023 : మళ్లీ తెరపైకి పసుపు బోర్టు .. ఈసారైనా రైతుల కల నెరవేరుతుందా..?

అయితే తాజాగా ప్రధాన మంత్రి పసుపు బోర్డు ప్రకటనతో.. ఆదివారం సాయంత్రం నిజామాబాద్​ వ్యవసాయ మార్కెట్​ కార్యాలయంలో మనోహర్‌ రెడ్డి చెప్పులు ధరించారు. పసుపు బోర్డు మంజూరుతో తన కల తీరిందంటూ మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. 12 ఏళ్ల దీక్షకు ఫలితంగా తమ జిల్లాలో పసుపు బోర్డు రాబోతుందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ రైతు మాదిరిగానే.. ఆ ప్రాంతంలోని మిగిలిన రైతులు పోరాటం చేశారు. తమ పోరాటానికి ఇప్పుడు ఫలితం దక్కిందంటూ సంబురాలు చేసుకుంటున్నారు.

పసుపు బోర్డు ఏర్పాటు వల్ల రైతులకు ఉపయోగమేంటి..?

  • 1987లో అన్ని రకాల సుగంధ ద్రవ్యాలకు కలిపి కేరళలో సుగంధ ద్రవ్యాల బోర్డును ఏర్పాటు చేశారు. ఇందులో 52 సుగంధ ద్రవ్యాలు ఉండగా.. అందులో పసుపు ఒకటి. నిజామాబాద్​లోనే 70శాతం పసుపు పండుతోంది. ఇక్కడ బోర్డు ఏర్పాటు చేస్తే.. ఈ పంటపై దృష్టి పెరిగి.. రైతులకు లాభాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
  • దేశంలో పసుపును ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. అందులోనూ నిజామాబాద్​ జిల్లాలో రైతులు ఎక్కువగా పసుపును పండిస్తారు. ఇక్కడ పంటే పంటకు ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్ ఉంది. ఇంకా చెప్పాలంటే ఆసియాలోనే ఎక్కువగా పసుపు పండేది నిజామాబాద్​లోనే. ప్రతి సంవత్సరం జిల్లాలో 30 నుంచి 35 వేల ఎకరాల్లో ఈ పంటను రైతులు సాగు చేస్తున్నారు. ఎన్నో కుటుంబాలు పసుపు ఉత్పత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి.
  • కొత్త వంగడాలు అభివృద్ధికి పసుపు బోర్డు దోహదం చేస్తుంది. రైతులకు పసుపు తవ్వకానికి, ఉడకబెట్టడం, ఆరబెట్టడం.. ఇలా మొదలైన పద్దతులకు యంత్రాలను సరఫరా చేస్తుంది. నిపుణులు రైతులకు పంటపై అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు. మార్కెటింగ్​ కోసం అంతర్జాతీయ కంపెనీలను తీసుకువచ్చే బాధ్యత బోర్డు తీసుకుంటుంది.

BJP Leaders and Farmers Celebrations on announcement Turmeric Board : పసుపు బోర్డు ప్రకటనతో నిజామాబాద్​ జిల్లా వ్యాప్తంగా సంబురాలు

'రాష్ట్రానికి గిరిజన విశ్వవిద్యాలయం, పసుపు బోర్డు' ప్రకటించిన ప్రధాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.