ETV Bharat / state

మరమ్మతుల కోసం వెళ్లి.. విద్యుదాఘాతంతో రైతు మృతి - farmer died with electric shock

విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఏబీ స్విచ్ (బ్రేకర్) ఆఫ్ చేసేందుకు యత్నించగా.. విద్యుత్ సరఫరా జరగడంతో ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదానికి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్థులు ఆరోపించారు.

farmer was electrocuted in Nizamabad district
విద్యుదాఘాతంతో రైతు మృతి
author img

By

Published : Jun 18, 2021, 12:29 PM IST

బోరుమోటర్ మరమ్మత్తుల కోసం విద్యుత్ లైన్ బ్రేకర్​ను ఆఫ్ చేయబోయి... విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం మేగ్యా నాయక్ తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన దేగావత్ కిషన్ నారుమడికి నీరు పెట్టేందుకు పొలానికి వెళ్లాడు. బోరు మోటర్ పనిచేయకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేసి సరి చేద్దామని భావించాడు. ఏబీ స్విచ్ (బ్రేకర్) ఆఫ్ చేసేందుకు యత్నించగా.. దానికి విద్యుత్ సరఫరా జరిగే అక్కడికక్కడే మృతి చెందాడు.

గతంలోనూ ఇదే చోట ప్రమాదం..

దీనికి విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే కారణమని తండావాసులు ఆరోపించారు. ఇదే స్తంభంపై పదేళ్ల క్రితం లైన్​ మెన్ మృత్యువాత పడినట్లు పేర్కొన్నారు. స్తంభం శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ మార్చలేదని, అందువల్లే ప్రమాదం జరిగింది ఆవేదన వ్యక్తం చేశారు. రైతు మృతికి విద్యుత్ శాఖ అధికారుల బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రైతుకు భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.

సమాచారం ఇవ్వలేదు...

వర్షం కురుస్తున్న సమయంలో అధికారులు కనీసం సమాచారం ఇవ్వకుండా రైతు అజాగ్రత్తగా స్విచ్ ముట్టుకోవడంతో ప్రమాదం జరిగిందని విద్యుత్ శాఖ ఏఈ రాజేందర్ తెలిపారు. ఇన్సులేటర్​లు దెబ్బతిన్న సమయంలో తడి తగిలితే విద్యుత్ సరఫరా జరిగే ఆస్కారం ఉందని వివరించారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులు తమ వ్యవసాయ క్షేత్రంలో అధికారులకు సమాచారం ఇవ్వకుండా, సిబ్బంది లేకుండా విద్యుత్ పరికరాల మరమ్మతులు చేయకూడదని సూచించారు.

ఇదీ చూడండి: CJI Justice NV Ramana: శ్రీశైలం సందర్శనలో సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.