నిజామాబాద్ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ప్రగతినగర్‌లోని శ్మశానవాటికలో వృద్ధురాలి మృతదేహాన్ని కుటుంబీకులు వదిలివెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సర్వజనిక్ శ్మశానవాటికకు నిన్న ఉదయం ఎనిమిది గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు ఆటోలో వృద్ధురాలి మృతదేహాన్ని తీసుకువచ్చారు. కట్టెలు తీసుకువస్తామని చెప్పి మృతదేహాన్ని అక్కడే వదిలి ముగ్గురు వ్యక్తులు వెళ్లిపోయారు.
వెళ్లినవారు రాకపోవడంపై శ్మశానవాటిక వాచ్మెన్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వృద్ధురాలి వయస్సు 60 సంవత్సరాలు వరకు ఉంటుందని అంచనా వేశారు. కుటుంబసభ్యులు ఇలా వృద్ధురాలి మృతదేహాన్ని వదిలేసి వెళ్లడంపై స్థానిక వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ