నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో గల్ఫ్ బాధితుల కోసం న్యాక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమానికి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. అవగాహన సదస్సులో పాల్గొని శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులతో... మంత్రి ముచ్చటించారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సంపాదించుకోవాలని సూచించారు. గల్ఫ్ బాట పట్టిన వారికి శిక్షణ ఎంతో ఉపకరిస్తుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
ఇవీ చూడండి: భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పిన ట్రంప్