ఇన్ఫెక్షన్లు త్వరగా సోకే అవకాశం ఉండడం వల్లే.. అధిక మంది డయాబెటిక్ రోగులు కరోనా బారిన పడుతున్నారని ఎండోక్రైనాలజిస్ట్ డా.వినయ్ ధన్‌పాల్ తెలిపారు. నిజామాబాద్‌లో ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో మధుమేహ వ్యాధిగ్రస్థుల్లో తలెత్తే ఇబ్బందులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించారు. పలువురు రోగులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.
డయాబెటిక్ ఉన్నవారిలో కరోనా వస్తే ఇతర అవయవాలపై ప్రభావం చూపించడం వల్లే పరిస్థితి విషమిస్తోందన్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా డయాబెటిక్, థైరాయిడ్ మందులు వాడాలన్నారు. కొవిడ్ నుంచి కోలుకున్న వారు సైతం చాలామంది డయాబెటిక్ బారిన పడుతున్నారని వినయ్ ధన్‌పాల్ తెలిపారు.
