నిజామాబాద్ జిల్లాలోని కాలూర్ ప్రాంతంలో పొలాలు కోస్తున్న యంత్రాలను కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించారు. రైతులకు, హార్వెస్టర్ యజమానులకు పలు సూచనలు చేశారు. పంటకోసే సమయంలో రైతులు, హార్వెస్టర్ యజమానులు పాటించాల్సిన జాగ్రత్తలు సరిగ్గా పాటించేలా చూసుకోవాలని తెలిపారు.
యంత్రం ఫ్యాన్స్పీడ్ 19-20 ఆర్పీఎం మాత్రమే ఉండాలని.. హార్వెస్టర్‌ను ఏ2, ఏ3 గేర్‌లో నడపాలన్నారు. ఇలా చేయడం వల్ల రైతులకు నాణ్యమైన వడ్లు వస్తాయని కలెక్టర్ అన్నారు. ఈ మేరకు జిల్లాలోని ప్రతి హార్వెస్టర్ యజమాని, రైతులు తాను చెప్పిన సూచనలు పాటించాలని నారాయణరెడ్డి కోరారు.
ఇదీ చదవండిః గత నాలుగు రోజుల్లో 203 మంది అదృశ్యం.. కారణాలివేనా?